బిగ్ అలర్ట్.. ఏపీకి భారీ వర్షాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-28 11:00:49  IST  )

దిత్వా తుఫాన్‌ ఎఫెక్ట్‌తో కోస్తా, రాయలసీమలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..

బిగ్ అలర్ట్.. ఏపీకి భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: నైరుతి బంగాళాఖాతం(Bengal Southwest Bay)లో దిత్వా తుఫాన్(Ditva Cyclone) ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అది నెమ్మదిగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండికి ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది. శని, ఆదివారాల్లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చేపల వేట కోసం మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ వాఖ అధికారులు హెచ్చరించారు. రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దన్నారు. ప్రస్తుతం దిత్వా తుఫాన్ శ్రీలంకకు 80 కి.మీ, పుదుచ్చేరికి 480 కిలో మీటర్లు, చైన్నైకి 580 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఆదివారానికి దక్షిణ కోస్తా తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Next Story