- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..?
రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ(Meteorological Department Officials) అధికారులు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేశారు. శ్రీకాకుళం(Srikakulam), విజయనగరం(Vijayanagaram), విశాఖ(Visakha), అనకాపల్లి(Anakapalli), అల్లూరి సీతారామరాజు(Alluri Sitharamaraju), కాకినాడ జిల్లా(Kakinanda District)లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే అల్లూరి, ఏలూరు జిల్లాలకు బుధ, గురువారం ఎల్లోఅలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తరకోస్తాలోని ప్రధాన పోర్టులకు అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Next Story






