ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-08-19 05:21:25  IST  )

ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది...

ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజులు పాటు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుందని, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంలో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో రైతులు, పశువుల కాపరులు చెట్లకు కిందకు వెళ్లొద్దన్నారు. చెరువులు, కుంటల వద్దకు సైతం వెళ్లొద్దని సూచించారు.

Next Story