తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-18 05:20:06  IST  )

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు...

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవ ముగిసిన తర్వాత వీఐపీ బ్రేక్(VIP) దర్శనాల ద్వారా ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌.డి రేవణ్ణ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తిరుమల వెంకన్న సేవలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ నిబంధనల ప్రకారం ప్రముఖులకు ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. దగ్గరుండి భక్తి శ్రద్ధలతో పూజా కైంకర్యాలు జరిపి లడ్డూ ప్రసాదం అందజేశారు. శ్రీవారి దర్శనంతరం ప్రముఖులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖులు తెలిపారు.

కాగా తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి వెంకన్న సేవలో పాల్గొంటున్నారు. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో వారి సౌకర్యార్థ్యం అధికారులు అన్ని ఏర్పాట్లు శారు.

Next Story