చేబ్రోలు కిరణ్‌పై 111 సెక్షన్ నమోదు.. పోలీసులపై జడ్జి ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-11 16:27:09  IST  )

చేబ్రోలు కిరణ్‌పై 111 సెక్షన్ నమోదు చేయడం పట్ల మంగళగిరి కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు...

చేబ్రోలు కిరణ్‌పై 111 సెక్షన్ నమోదు.. పోలీసులపై జడ్జి ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ఐటీటీడీ మాజీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌(Former ITTD activist Chebrolu Kiran)ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే ఆయన్ను మంగళగిరి కోర్టు(Mangalagiri Court)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి(YS Jagan Mohan Reddy Wife Bharati)పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టారు.

అయితే కిరణ్‌పై 111 సెక్షన్ నమోదు చేయడంపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం కేసులు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సీఐకి చార్జ్‌మెమో ఇవ్వాలని, అలాగే లిఖితపూర్వకంగానూ వివరణ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించారు. కిరణ్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో కిరణ్‌ను పోలీసులు జైలుకు తరలించారు.

Next Story