మొలకలచెరువు నకిలీ మద్యం కేసు.. నిందితుడు కొడాలి శ్రీనివాసరావు అరెస్ట్

by Kema Shiva Kumar |

మొలకలచెరువు (Molakalacheruvu)లో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు

మొలకలచెరువు నకిలీ మద్యం కేసు.. నిందితుడు కొడాలి శ్రీనివాసరావు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మొలకలచెరువు (Molakalacheruvu)లో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ మేరకు తాజాగా మద్యం తయారీకి షెడ్డు లీజుకు తీసుకున్న తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు (Kodali Srinivasa Rao)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A12గా ఉన్న అతడు తెనాలి (Tenali)లోని ఐతానగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో కుంటుంబంతో ఉంటున్నాడు. తెనాలికి వచ్చిన ఎక్సైజ్ పోలీసులు శ్రీనివాసరావు కోసం వెతకగా అప్పటికే ఆప్పటికే పరారయ్యాడు. దీంతో అతడిని చాకచక్యంగా ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

కాగా, కొన్నేళ్లుగా తెనాలిలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు వైసీపీ (YCP)లో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీ పోలింగ్ ఏజెంట్‌గానూ వ్యవహరించారని సమాచారం. మొలకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రానికి సంబంధించిన షెడ్డు శ్రీనివాసరావు పేరుతో లీజుకు తీసుకున్నట్లుగా తేలింది. ఆయన నివాసంలో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లభించ లేదు. తాజాగా కొడాలి శ్రీనివాసరావు అరెస్ట్‌తో కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Next Story