- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో మరోసారి వర్షాలు పడనున్నాయి. ఇ

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో మరోసారి వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చలితో జనాలు వణికి పోతున్నారు. ఇలాంటి తరుణంలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
దీని ఎఫెక్ట్ కారణంగా రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణకోస్తాతో పాటు రాయలసీమకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అధికారి వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా వెల్లడించింది.
ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. కొన్నిచోట్ల ఆరు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్నిచోట్ల 35 డిగ్రీలకు పైగా వేడి కూడా కొనసాగుతోంది. ఇక ఇప్పుడు రెండు రోజుల పాటు వర్షాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.






