‘అన్నా.. ఒకసారి నీ ముఖం చూసుకో’.. మాజీ ఎమ్మెల్యే అనుచరులు విచారం

by Jakkula.Mamatha |

కృష్ణా జిల్లాలోని ఆత్కూరు భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని(Vallabhaneni Vamsi) పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు

‘అన్నా.. ఒకసారి నీ ముఖం చూసుకో’.. మాజీ ఎమ్మెల్యే అనుచరులు విచారం
X

దిశ,వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాలోని ఆత్కూరు భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని(Vallabhaneni Vamsi) పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో నేడు(శనివారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వంశీని విచారించారు. ఈ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు ప్రశ్నించారు. ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో వంశీపై కేసు నమోదైంది.

గన్నవరం టీడీపీ కార్యాలయం(TDP Office)పై దాడి కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ(Vijayawada) జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారనే విషయం తెలిసిందే. నేడు కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో విచారణ అనంతరం గన్నవరం కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో వైసీపీ నేత వంశీ తెల్లజుట్టు, విభూతితో కనిపించారు. వల్లభనేని వంశీ అవతారం చూసి ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో కోర్టుకు హాజరయ్యే క్రమంలో వల్లభనేని వంశీని అనుచరులు కలిశారు. ఆయన్ను చూసిన వారు.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో ‘‘అన్నా.. ఒకసారి ముఖం చూసుకో ఎలా అయిపోయావో’’ అని విచారం వ్యక్తం చేశారు.

Next Story