కాళేశ్వరంపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-31 12:53:49  IST  )

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)పై ఏపీ ఐటీశాఖ మంత్రి నారా(Nara lokesh) లోకేష్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరంపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)పై ఏపీ ఐటీశాఖ మంత్రి నారా(Nara lokesh) లోకేష్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో లోకేష్ మాట్లాడుతూ.. తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Banakacharla Project)పై తాము ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. అసలు కాళేశ్వరం కట్టేముందు అనుమతులు కూడా తీసుకోలేదని అన్నారు. మిగులు జలాలు వాడుకునేందుకు దిగువ రాష్ట్రంలో పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును నిర్మించుకుంటే ఎగువ రాష్ట్రాలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నాయో అర్థం కావడం లేదన్నారు.

రాజకీయ లబ్ది కోసమే నీటి వివాదాలకు తెర లేపుతున్నారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేందుకే కొన్ని పార్టీలు పనిగట్టుకొని బనకచర్లపై వివాదాలు రేపుతున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. పోలవరం-బనకచర్ల కట్టి తీరుతామని, ఏపీ ప్రజల ప్రయోజనాల ముందు తమకు ఏవీ ఎక్కువ కాదని పేర్కొన్నారు.

Next Story