- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకేశ్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం
యువగళం పాదయాత్ర పున: ప్రారంభం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజమండ్రి ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : యువగళం పాదయాత్ర పున: ప్రారంభం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజమండ్రి ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ చేరుకున్న నారా లోకేశ్‌కు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్పతోపాటు మాజీమంత్రులు గొల్లపల్లి సూర్యారావు, ప్రత్తిపాటి పుల్లారావు, బండారు సత్యనారాయణ మూర్తి, దేవినేని ఉమా మహేశ్వరరావులతోపాటు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ వద్దకు భారీగా నాయకులు తరలివచ్చారు. నారా లోకేశ్‌తో ముచ్చటించారు. అక్కడ నుంచి నారా లోకేశ్ రోడ్డు మార్గాన రాజోలు నియోజకవర్గం బయలుదేరి వెళ్లారు. ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో పొదలాడ నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు.
Next Story






