- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యాన్సర్ బాధితుడికి అండగా నిలిచిన లోకేశ్
by Thanuru Gopichand |
క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న వ్యక్తికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు.

X
దిశ, ఏపీ బ్యూరో : క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న వ్యక్తికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు.గుంటూరు జిల్లా ధర్మకోటకు చెందిన గార్లపాటి బ్రహ్మయ్య క్యాన్సర్ వ్యాధి బారినపడి కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యానికి సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆదుకోవాలని బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు ఎక్స్ ద్వారా లోకేశ్ ను విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరు చేసి అండగా నిలిచారు. సాయం కోరిన వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ కు బ్రహ్మయ్య, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






