Lokesh: లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ

by Thanuru Gopichand |   (  Updated:2025-05-26 04:43:51  IST  )

తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్​కు పదోన్నతి రానుంది.

Lokesh: లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ
X

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌కు అవకాశం

రాజకీయ వారసుడిగా బలమైన పునాది

దిశ, డైనమిక్​ బ్యూరో : తెలుగుదేశం పార్టీలో (TDP) కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్​కు పదోన్నతి రానుంది. ఆయనకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి(వర్కింగ్‌ ప్రెసిడెంట్‌)గా (Working President) బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన పార్టీ అధిష్టానంలో ఉన్నట్లు సమాచారం. రేపటి నుంచి కడప వేదికగా జరిగే మహానాడు (Mahanadu) ఒక కీలక నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లోకేశ్​తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు పార్టీలో సీనియర్ల నుంచి జూనియర్ల వరకు మంచి పట్టుంది. లోకేష్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ని చేయాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్ఠానంపై కొంతకాలంగా ఒత్తిడి పెరుగుతోంది. కొంతమంది పార్టీ నాయకులు తమ గళాన్ని అప్పుడప్పుడూ పలు వేదికలపై వినిపిస్తున్నారు. ఈ క్రమంలో రేపటి నుంచి కడపలో ప్రారంభమయ్యే మహానాడులో ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకుని, ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారిక పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రతి నిత్యం సచివాలయానికి వచ్చిన పాలనా వ్యవహరాలను చూస్తున్నారు. అటు కార్యకర్తలతోనూ మమేకం అవుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో కార్యకర్తలలో ఉండడం ప్రస్తుతం ఉన్న బిజీలో కష్టమయ్యే పనే..! దీంతో పార్టీ బాధ్యతలను లోకేశ్​కు అప్పగించడం మంచిదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో లోకేష్‌కు నూతన బాధ్యతలు అప్పగించే ప్రకటన మహానాడులో చేస్తారని పార్టీ నేతలు, కార్యకర్త లు భావిస్తున్నారు.

యువగళం.. రెడ్​బుక్​

ముఖ్యంగా ఎన్నికలకు ముందు యువగళం (Yuvagaalm) పాదయాత్రలో లోకేశ్​పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాడు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగింది. లోకేశ్​ను అడ్డుకునేందుకు అప్పటి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. అన్ని అడ్డంకులను అధిగమించి ఆయన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో రెడ్​బుక్​చేత పట్టుకుని ఎవరైతే నాటి పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారి పేర్లను నమోదు చేసుకుంటున్నానని ఆయన హెచ్చరించారు. అన్నట్లుగానే అదికారంలోకి వచ్చిన తర్వాత నాడు అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్చలు మొదలయ్యాయి. దీంతో లోకేశ్​పరపతి కూడా పార్టీలో పెరిగింది. అదే విధంగా వినూత్నం ప్రజాదర్బార్​ను నిర్వహిస్తూ ప్రజలకు కూడా చేరువయ్యారు. ఈ నేపథ్యంలో లోకేశ్​కు పార్టీలో కీలక పదవి కట్టబెడతారని, మహానాడు కార్యక్రమం ఇందుకు వేదిక కానుందని అంతా భావిస్తున్నారు.

Next Story