- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుతో లోకేశ్,బ్రాహ్మణి ములాఖత్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

దిశ , డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు గత 45రోజులుగా రాజమహేంద్రవరం జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబును ములాఖత్‌లో భాగంగా కుటుంబ సభ్యులు సోమవారం కలిశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణిలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. నారా లోకేశ్ దంపతులతోపాటు పార్టీ సీనియర్ నేత మంతెన సత్యనారాయణరాజు సైతం చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయ్యారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని జగన్మాతను కోరుకుంటున్నట్లు తెలిపారు. నేటి ఈ చీకట్లు తొలగిపోయి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తెలుగు ప్రజలందరికీ నారా భువనేశ్వరి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.






