ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసు విచారణ.. ఏం జరిగిందంటే..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-20 12:57:17  IST  )

విజయవాడ ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసు విచారణ జరిగింది....

ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసు విచారణ.. ఏం జరిగిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court)లో లిక్కర్ కేసు(Liquor Case) విచారణ జరిగింది. నిందితుడు దిలీప్(Accused Dileep) దాఖలు చేసిన పిటిషన్‌పై వాదోపవాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. దీంతో దిలీప్‌కు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ అనుచరుల్లో నెలకొంది.

కాగా జగన్ ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అవకతవకలు జరిగినట్లు పోలీసులు = గుర్తించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ అధికారులు దర్యాప్తు చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి చెందిన నేతలతో పాటు పలువురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 12 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సైతం అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నిందితులంతా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కేసులో ఏ30గా నిందితుడు దిలీప్ సైతం బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈమేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో బుధవారం విచారణ జరిగింది.

Next Story