ఆ వీడియోలు ఇవ్వండి: లిక్కర్ కేసు నిందితుడు రాజ్‌కేసిరెడ్డి మరో పిటిషన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-05 13:25:35  IST  )

మద్యం కేసులో సీజ్ చేసిన డబ్బు సీసీ ఫుటేజులు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో నిందితుడు కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.. .

ఆ వీడియోలు ఇవ్వండి: లిక్కర్ కేసు నిందితుడు రాజ్‌కేసిరెడ్డి మరో పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం కేసు(LIquor Case) నిందితుడు రాజ్ కేసిరెడ్డి(Raj Kesireddy) తరపున విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court)లో మరో పిటిషన్ దాఖలు అయింది. హైదరాబాద్ శివారులో సిట్ గుర్తించిన రూ. 11 కోట్లకు సంబంధించిన వీడియోలను ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బులను విజయవాడ సిట్ కార్యాలయంలో ఉంచారని, అక్కడ నుంచి మాచవరం ఎస్బీఐకి తరలించాలని, ఆ సమయంలో రికార్డైన సీసీ టీవీ ఫుటేజులను ఇవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. నగదు సీజ్ చేసిన ఫామ్ హౌస్, వర్ధమాన్ కాలేజ్ దగ్గర రెండు వారాలకు ముందు ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాగా ఏపీ మద్యం కేసులో పెను సంచనాలు నమోదు అవుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే మరో నిందితుడు వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఫామ్ హౌస్‌లో సిట్ అధికారులు తనిఖీలు చేయడంతో మొత్తం రూ. 11 కోట్లు దొరికాయి. ఈ డబ్బును హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. ఆ తర్వాత సీజ్ చేసి ఆ డబ్బులను మాచవరం ఎస్బీఐలో డిపాజిట్ చేశారు.

అయితే ఆ డబ్బుతో తనకు సంబంధంలేదని ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి తెలిపారు. అంతేకాదు ఈ డబ్బును వేరే డబ్బులతో కలపకూడదని, వాటి సీరియల్ నెంబర్లను నమోదు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన అభిప్రాయంతో కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే తాజాగా రాజ్ కేసిరెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ సిట్ కార్యాలయంతో పాటు మాచవరం ఎస్బీఐ వద్ద రికార్డైన సీసీ ఫుటేజులు ఇవ్వాలని కోరారు. రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను రేపో, ఎల్లుండో కోర్టు స్వీకరించనుంది.

Next Story