లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

by Naga Rani Yarlagadda |

ఏపీలోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు.

ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో చెట్లకింద నిలబడవద్దని సూచించారు. అలాగే శనివారం సాయంత్రం 5 గంటల వరకు.. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,67,175 క్యూసెక్కులు ఉన్నట్లు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వద్ద వరద ప్రవాహం కొద్దిరోజులపాటు హెచ్చుతగ్గులుగా ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కాబట్టి కొద్దిరోజులపాటు నదీపరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదన్నారు.

Next Story