మనం కలిసి పనిచేద్దాం..ఆనంద్ మహీంద్రాకు లోకేష్ రిప్లై

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-19 14:48:10  IST  )

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా, మంత్రి నారా లోకేష్ మధ్య ట్విట్టర్‌లో ఆసక్తికర సంభాషణ జరిగింది. ఒకరి ట్వీట్‌కు మరొకరు సమాధానం ఇస్తూ నెటిజన్లను ఆకట్టుకున్నారు.

మనం కలిసి పనిచేద్దాం..ఆనంద్ మహీంద్రాకు లోకేష్ రిప్లై
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా, మంత్రి నారా లోకేష్ మధ్య ట్విట్టర్‌లో ఆసక్తికర సంభాషణ జరిగింది. ఒకరి ట్వీట్‌కు మరొకరు సమాధానం ఇస్తూ నెటిజన్లను ఆకట్టుకున్నారు. మొదట ఆనంద్ మహింద్రా ట్రక్కులపై తెలుగులో తీసిన ప్రమోషనల్ మీడియోను ట్వీట్ చేస్తూ తెలుగులోనే క్యాప్షన్ ఇచ్చారు. దానిపై స్పందించిన లోకేష్ తెలుగులో ట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపి ఏపీలో పెట్టుబడులు పెట్టారని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు.

అనంతరం ఆనంద్ మహింద్రా ఖచ్చితంగా పెడతామని, ఇప్పటికే కొన్ని ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. టూరిజంలోనూ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. దీంతో ఆయనకు లోకేష్ రిప్లై ఇచ్చారు. మనం కలిసి పనిచేద్దామని, ధన్యవాదాలు తెలిపారు. మీ పెట్టుబడులను గొప్పగా భావిస్తున్నామని అన్నారు. వాటిని మ‌రింత పెంచాల‌ని తాను ఎదురుచూస్తున్న‌ట్టు చెప్పారు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, ర‌క్ష‌ణ మ‌రియు ఎరోస్పేస్ ప‌రిక‌రాల త‌యారీలో మ‌హింద్రా గ్రూప్ ప్ర‌ణాళిక‌ల గురించి చ‌దివిన‌ట్టు తెలిపారు. ప్ర‌తి ఉప రంగానికి గ‌రిష్ట ప్రోత్స‌హాకాల‌ను అందించ‌గ‌ల‌, అనుకూలించ‌గ‌ల విధానాల‌ను క‌లిగి ఉంద‌న్నారు. త‌యారీ కోసం ఏపీని ప‌రిగ‌ణిస్తే సంతోషిస్తాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి సంభాష‌ణ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Next Story