శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత హల్‌చల్.. తీవ్ర భయాందోళనలో భక్తులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-31 05:10:44  IST  )

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతి (Tirupati)లో ఇవాళ ఉదయం మరోసారి చిరుతపులి హల్‌చల్ సృష్టించింది.

శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత హల్‌చల్.. తీవ్ర భయాందోళనలో భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతి (Tirupati)లో ఇవాళ ఉదయం మరోసారి చిరుతపులి హల్‌చల్ సృష్టించింది. 150వ మెట్టు వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా భక్తులు చూశారు. అనంతరం వారు భయంతో గట్టిగా కేకలు వేయడంతో అదృష్టవశాత్తు చిరుత అక్కడి నుంచి పరార్ అయ్యింది. దీంతో అక్కడున్న వారు టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేయగా.. వారు స్పాట్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భక్తులెవరూ ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగుంపులుగా మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మళ్లీ చిరుత కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందజేయాలని అటవీ శాఖ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Next Story