- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chirutha: క్యాంపస్ లో చిక్కిన చిరుత
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ లో అటవీ శాఖ సిబ్బంది ఏర్పాటుచేసిన బోనులో చిరుత చిక్కింది

దిశ డైనమిక్ బ్యూరో / తిరుపతి ప్రతినిధి: తిరుపతి (Tirupathi) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ లో (SVU Campus) అటవీ శాఖ సిబ్బంది ఏర్పాటుచేసిన బోనులో చిరుత (cheetah) చిక్కింది. కొంతకాలంగా ఈ చిరుత క్యాంపస్లో సెంచరి స్తూ విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తుంది. కొంతకాలంగా చిరుత సంచారంతో విద్యార్థులు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మూడు నెలలుగా ఈ చిరుత వేదిక యూనివర్సిటీ, ఎస్వీయూ వద్ద సంచరిస్తోంది. ఈ ప్రాంతంలో రోజు వందలాదిమంది వాకింగ్ చేస్తుంటారు. చిరుత సంచారంతో పాదచారులు ఇటువైపు రావడం లేదు. అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు బిగించి రెండు మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారుజామున ఆ చిరుత ఓ బోన్ లో చిక్కింది.దీంతో వర్సిటీలోని విద్యార్థులు అధ్యాపకులు ఊపిరి పీల్చుకున్నారు. బోనుకు చిక్కిన చిరుతను శేషాచల అటవీ ప్రాంతంలోని దట్టమైన అడవిలో విడిచిపెడుతున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు.






