వైజాగ్‌లో సందడి చేసిన లెజెండరీ ఫుట్‌బాలర్ డేవిడ్ బెకమ్

by Malleboina Mahesh |

లెజెండరీ ఫుట్‌బాలర్, యూనిసెఫ్ ఇండియా (UNICEF India) గుడ్‌విల్ అంబాసిడర్ అయిన డేవిడ్ బెకమ్ ఆంధ్రప్రదేశ్‌లోని కోఠావళస (విశాఖపట్నం సమీపంలో) వద్ద ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు.

వైజాగ్‌లో సందడి చేసిన లెజెండరీ ఫుట్‌బాలర్ డేవిడ్ బెకమ్
X

దిశ, వెబ్ డెస్క్: లెజెండరీ ఫుట్‌బాలర్, యూనిసెఫ్ ఇండియా (UNICEF India) గుడ్‌విల్ అంబాసిడర్ అయిన డేవిడ్ బెకమ్ ఆంధ్రప్రదేశ్‌లోని కోఠావళస (విశాఖపట్నం సమీపంలో) వద్ద ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. బెకమ్ రాకతో ఆ పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, ఆట స్థలం అంతా విద్యార్థుల ఉత్సాహంతో నిండిపోయింది. ఆయన చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడటం, వారిని ప్రోత్సహించడం, ఉల్లాసంగా గడపడం అందరినీ ఆకట్టుకుంది.

"మా తరగతి గదులు, ఆట స్థలాన్ని మీ హృదయపూర్వక సంభాషణలు, ప్రోత్సాహం, ఉల్లాసభరితమైన శక్తితో నింపిన లెజెండరీ ఫుట్‌బాలర్ డేవిడ్ బెకమ్‌కు ధన్యవాదాలు. మా విద్యార్థులు బెకమ్ లాగా బంతిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహపడ్డారు – ఈ పాఠాలు వారు జీవితాంతం గుర్తుంచుకుంటారు! పిల్లల కలలు మరియు విద్య పట్ల మీ నిబద్ధతకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము," అని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Next Story