పవన్‌ కల్యాణ్‌ న్యాయం చేస్తారని ఎదురు చూశా: లక్ష్మి

by Vemula.Srinu Prasad |

కిరణ్ రాయల్ విషయంలో పవన్ కల్యాణ్ అయినా న్యాయం చేస్తారని ఎదురు చూశానని లక్ష్మి తెలిపారు

పవన్‌ కల్యాణ్‌ న్యాయం చేస్తారని ఎదురు చూశా: లక్ష్మి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్(Tirupati Janasena leader Kiran Royal) విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అయినా న్యాయం చేస్తారని ఎదురు చూశానని లక్ష్మి(Laxmi) తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో జైపూర్ కోర్టు(Jaipur Court) బెయిల్ మంజూరు చేయడంతో ఆమె వీడియో విడుదల చేశారు. కిరణ్ రాయల్ చేసిన అన్యాయంపై ఆరోపణలు చేశారు. తన దుస్థితికి కిరణ్‌ రాయల్‌ కారణమని చెప్పారు. తనకు, తన కుటుంబానికి ఏదైనా జరిగితే కిరణ్‌ రాయల్‌దే బాధ్యతన్నారు. తాను నిర్దోషినని.. తన ప్రమేయంలేదని కేసు క్లోజ్ చేశారని చెప్పారు. కిరణ్ రాయల్ విషయంలో తన ఫిర్యాదును తీసుకోలేదని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్యాయం జరిగిందని చెబితే పట్టించుకోలేదన్నారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, తిరుపతికి వెళ్లి అన్ని వివరాలు వెల్లడిస్తానని లక్ష్మి పేర్కొన్నారు.

Next Story