- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయమ్మకు లోకేష్ బర్త్ డే విషెస్.. దరిద్రమంటూ లక్ష్మిపార్వతి ఫైర్
వైఎస్ విజయమ్మకు మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలపడంపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్(Former Cm Jagan) మాతృమూర్తి వైఎస్ విజయమ్మ(Ys Vijayamma)కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ట్వీట్ చేశారు. దీంతో వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి(Ycp Women Leader Laxiparvati) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినైతే విమర్శించారో ఆవిడకే జన్మదిన శుభాకాంక్షలు తెలపడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ప్రతిదీ రాజకీయం చేస్తున్న తండ్రీకొడుకులను చూసి నవ్వుతున్నారని లక్ష్మిపార్వతి విమర్శించారు. తండ్రే చంద్రబాబునే అనుకుంటే.. తండ్రిని మించి కొడుకు తయారయ్యాడని మంత్రి లోకేష్‌ను ఉద్దేశించి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. తండ్రీకొడుకులు ఓ జోకర్‌లా తయారయ్యారన్నారు. ఐటీడీపీలో విజయమ్మను హీనంగా చిత్రించి చూపించారని మండిపడ్డారు. నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రోజు రోజుకు దిగజారిపోతున్నారని ధ్వజమెత్తారు. ఇకపై గెలవరని చంద్రబాబు అర్ధమైపోయిందన్నారు. గత ఎన్నికల్లోనూ అడ్డదారిలో గెలిచారని విమర్శించారు.






