- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు అండగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వమే: మంత్రి నాదెండ్ల
రైతులకు అండగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వమేనన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వ హయాంలో ఈ సమయానికి 4.43 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. కూటమి ప్రభుత్వం 9.14 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: రైతులకు అండగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వమేనన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వ హయాంలో ఈ సమయానికి 4.43 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. కూటమి ప్రభుత్వం 9.14 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యాన్ని సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని వివరించారు. జిల్లాల వారిగా 2023-24 సంవత్సరంలో సేకరించిన ధాన్యం, 2024-25 ఏడాదిలో సేకరించిన ధాన్యం వివరాలను ఆయన వెల్లడించారు.
కాకినాడ సీజ్ ది షిప్ వ్యవహారంపై నిన్న ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి.. అక్కడ దేశ భద్రతకే భంగం కలిగించేలా స్మగ్లింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. రూ.12,800 కోట్లు ఖర్చుపెట్టి ప్రజలకు రేషన్ బియ్యాన్ని అందిస్తోంటే, కొందరు వాటిని అక్రమంగా రవాణా చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న 13 కంపెనీలపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు.






