- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: చెరువులో పడి ముగ్గురు మృతి
by Vemula.Srinu Prasad |
ఎమ్మిగనూరు మండల పరిధి సిరాలదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. ...

X
దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండల పరిధి సిరాలదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లిన బంధువులు బట్టలు ఉతికేందుకు గ్రామంలోని చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ బట్టలు ఉతుకుతున్న సమయంలో లక్కీ(లోకేష్) అనే ఐదు సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. అయితే బాలుడి కాపాడేందుకు ఇద్దరు మహిళలు చెరువులో దూకారు. అయితే వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు నీటిలో మునిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సలోని(25), మరియమ్మ (28), లోకేష్ (5)గా గుర్తించారు. ఈ ఘటనతో పెళ్లికి హాజరైన బంధువుల దుఃఖరోదనులతో పెళ్లి ఇల్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. మృతదేహాలను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






