Kurnool: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

Kurnool: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఆదోని మండలం గణేకల్ వద్ద రెండు ఆటోలు(Autos) ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందిన రత్నాబాయ్, ఈసన్నగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. స్థానికుల నుంచి ప్రమాద వివరాలు సేకరించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story