- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Allagadda: ఫోన్ మాట్లాడుతూ వివాహిత దుర్మరణం
ఆళ్లగడ్డ వద్ద జాతీయ రహదారిలోని ఓ హోటల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో వివాహిత దుర్మరణం చెందారు...

X
దిశ ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలోని ఓ హోటల్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో వివాహిత దుర్మరణం చెందారు. సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ఆమెను లారీ ఢీకొట్టింది. అనంతరం తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు బద్వేల్ ఐలమ్మ కాలనీకి చెందిన వివాహితగా గుర్తించారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాద ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వివాహితను గుర్తుతెలియని వ్యక్తి లారీ కిందికి నెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
Next Story






