ప్రజల అర్జీలు.. స్పాట్‌లోనే మంత్రి పరిష్కారం

by Vemula.Srinu Prasad |

ప్రజా అర్జీలపై మంత్రి జనార్దన్ రెడ్డి స్పాట్‌లోనే పరిష్కారం చూపారు...

ప్రజల అర్జీలు.. స్పాట్‌లోనే మంత్రి పరిష్కారం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను ఆయన స్వయంగా స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. న్యాయబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో సంబంధిత అధికారులతో అక్కడిక్కడే ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఎక్కువగా రెవెన్యూ సమస్యలు, ఫించన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి అంశాలు ఆయన దృష్టికి రాగా ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించానని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story