వైభవంగా శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

by Disha Web Desk 16 |
వైభవంగా శ్రీశైలం బ్రహ్మోత్సవాలు
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. 5వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపజేసి వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహారించేందుకు రావణ వాహానంపై స్వామి అమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు.ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది.

Next Story

Most Viewed