- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kurnool : పదవీ విరమణ తరువాత రైతు అవుతాను
పదవీ విరమణ తరువాత తాను రైతు అవుతానని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి (Collector Siri) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : పదవీ విరమణ తరువాత తాను రైతు అవుతానని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి (Collector Siri) అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని రైతు సాధికార సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నల్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు ఐదు రోజుల శిక్షణను ఇవ్వనున్నారు. శిక్షణలో భాగంగా సహజ వ్యవసాయంపై వారికి అవగాహన కల్పించనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సిరి మాట్లాడుతూ ఆహార ఉత్పత్తిలో వ్యవసాయం అత్యంత కీలకమైందన్నారు. ప్రతి రైతు అన్నదాత అని పేర్కొన్నారు. వ్యవసాయం, పశు పోషణ లేకుంటే జీవి మనుగడ కష్టమవుతుందన్నారు. అయితే పంటను పండించడంలో ఇటీవల రసాయనాల వినియోగం పెరిగిందన్నారు. దాని వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందన్నారు. సహజమైన పద్ధతుల్లో పంటను పండిస్తే అది పర్యావరణానికి మేలు చేస్తుందన్నారు. అంతేకాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందన్నారు. తనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువన్నారు. పదవీ విరమణ తరువాత రైతుగా జీవనం సాగిస్తామని తెలిపారు.






