- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలు | కేవీ సుబ్బారెడ్డి కాలేజీ దగ్గర కిడ్నాప్ యత్నంతో కలకలం
కర్నూలు (Kurnool) కేవీ సుబ్బారెడ్డి కాలేజీ (KV Subba Reddy College) దగ్గర కిడ్నాప్ యత్నం సంఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది.

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు (Kurnool) కేవీ సుబ్బారెడ్డి కాలేజీ (KV Subba Reddy College) దగ్గర కిడ్నాప్ యత్నం సంఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. టెట్ పరీక్షలు జరుగుతున్న వేళ ఇటువంటి ఘటన జరగడం విద్యార్థుల్లో భయాందోళనలను కలగజేస్తోంది. ముఖ్యంగా విద్యార్థినుల భద్రతపై అనుమానాలను పెంచుతోంది. పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థినిలకు అందిస్తున్న రక్షణపై సవాళ్లను రేకెత్తిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం కర్నూలులోని కేవీ సుబ్బారెడ్డి కాలేజీలో టెట్ పరీక్ష కేంద్రం పడింది. విద్యార్థులు పరీక్ష రాసేందుకు కళాశాల వద్దకు వివిధ మార్గాల్లో చేరుకుంటున్నారు. ఓ విద్యార్థిని కూడా పరీక్ష రాసేందుకు కళాశాల వద్దకు వచ్చింది. గేటు సమీపంలోకి వచ్చే సమయంలో కొందరు దుండగులు ఆమెను గమనిస్తూ ఉన్నారు. అంతా హడావుడిగా ఉన్న క్రమంలో వారు తమ ప్రణాళికను అమలు చేశారు. విద్యార్థినిని కిడ్నాప్ చేయాలనే తమ కుట్రకు తెరలేపారు. అనుకున్నట్లుగానే ఒక్కసారిగా విద్యార్థినిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అసలేం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు విద్యార్థినిని లాక్కెళ్లే ప్రయత్నం మరింత వేగవంతం చేశారు. అయితే ఆమెతో పాటు ఉన్న సహచరులు దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి నుంచి విద్యార్థినిని విడిపించారు. భయభ్రాంతులకు గురైన సదరు విద్యార్థిని అక్కడ నుంచి పరుగులు పెట్టింది. కిడ్నాప్ కు యత్నించిన వారి నుంచి తప్పించుకొని పారిపోయింది. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఆకస్మిక ఘటనతో కర్నూలు వ్యాప్తంగా కలకలం రేగింది. టెట్ పరీక్షల వేళ పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.






