కర్నూలు ప్రమాదం కేసులో మృత దేహాల అప్పగింత పూర్తి

by Thanuru Gopichand |   (  Updated:2025-10-27 06:07:04  IST  )

కర్నూలు బస్సు దగ్ధం కేసులో గుర్తు పట్టలేనంత భయానక స్థితిలో మృతుల శరీరాలు దెబ్బతిన్నాయి.

కర్నూలు ప్రమాదం కేసులో మృత దేహాల అప్పగింత పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు బస్సు ప్రమాదం కేసులో గుర్తు పట్టలేనంత భయానక స్థితిలో మృతుల శరీరాలు దెబ్బతిన్నాయి. దీంతో వారిని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలను చేయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. డీఎన్ఏ పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆదివారం మృత దేహాలను కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించడం అధికారులు ప్రారంభించారు. సోమవారం నాటికి 19 మృత దేహాలను అప్పగించడం పూర్తి చేశారు. డీఎన్ఏ పరీక్షల ఆధారంగానే మృతులను గుర్తించి పార్థివ దేహాలను వారి కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పజెప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే కర్నూలులోనే అంత్యక్రియలను నిర్వహించాలని మృతుల కుటుంబ సభ్యులు కోరారు. దీంతో కర్నూలులోనే అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు చేశారు. బిహార్ కు చెందిన ఓ మృతుడికి అంత్యక్రియలను ఇప్పటికే నిర్వహించగా.. తమిళనాడుకు చెందిన ప్రశాంత్ అంత్యక్రియలను నేడు నిర్వహించనున్నారు. ప్రశాంత కుటుంబ సభ్యుల వినతి మేరకు కర్నూలులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Next Story