Ap News: 29న కర్నూలు జిల్లాకు సీఎం జగన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-11-23 15:51:00  IST  )

జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 29 ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి వెళ్లనున్నారు...

Ap News: 29న కర్నూలు జిల్లాకు సీఎం జగన్
X

దిశ, కర్నూలు ప్రతినిధి: జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 29 ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామం, కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించనున్నారు.


ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్ల, భద్రతను జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ గురువారం పరిశీలించారు. ముఖ్యంత్రి హెలిప్యాడ్, సభా స్థలం, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఇతర భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జేసీ, ఎస్పీలు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

Next Story