Srisailam మల్లన్నను దర్శించుకోనున్న ఏపీ గవర్నర్.. అప్రమత్తమైన కలెక్టర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-19 17:18:50  IST  )

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. దీంతో జిల్లా కలెక్టర్, పోలీసులు అప్రమత్తమయ్యారు..

Srisailam మల్లన్నను దర్శించుకోనున్న ఏపీ గవర్నర్.. అప్రమత్తమైన కలెక్టర్
X

దిశ, శ్రీశైలం: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. దీంతో జిల్లా కలెక్టర్, పోలీసులు అప్రమత్తమయ్యారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి పరిశీలించారు. సున్నిపెంటలోని హెలిప్యాడ్ మైదానాన్ని పరిశీలించారు. ప్రొటో కాల్ ప్రకారం హెలిప్యాడ్ ఏర్పాట్లు, చుట్టూ బ్యారికేడింగ్, తాత్కాలిక శౌచాలయాల ప్రదేశాలను పరిశీలించారు. సంబంధిత అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. అలాగే సున్నిపెంట హెలిప్యాడ్ మైదానం నుంచి మాక్ ట్రయల్ రన్, పారిశుధ్య చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై చర్చించారు. గవర్నర్ భ్రమరాంబ అతిథి గృహం నుంచి ప్రధానాలయ గోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్దకు చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.. అక్కడ శ్రీకృష్ణ దేవరాయగోపురం వద్ద రాష్ట్ర గవర్నర్‌కు ఆలయ సంప్రదాయాలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారని చెప్పారు.

Next Story