- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరో ప్రమాదం
కర్నూలులోని చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని మరువక ముందే అదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలులోని చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని మరువక ముందే అదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నటేకూరు-చెట్ల మల్లాపురం మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు ఓ కంటైనర్ ట్రక్కు వెళ్తోంది. చిన్నటేకూరు-చెట్ల మల్లాపురం ప్రాంతంలోకి రాగానే ఆ ట్రక్కు ముందు వెళ్తున్న కార్లను ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొట్టడంతో మూడు కార్లు దెబ్బతిన్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది. మూడు కార్లు డ్యామేజ్ కావడంతో అటుగా వెళ్తున్న వారు భయానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. చిన్నటేకూరు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మరో ప్రమాదం జరగడంతో అటుగా వెళ్తున్న వారు ఆ ప్రమాదాన్ని చూసి చర్చించుకుంటున్నారు. ఎవరికి ఏమి కాలేదనే సమాచారంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు కోరుతున్నారు. అతివేగం, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడొద్దని సూచిస్తున్నారు.






