- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపిస్ట్ కులవర్థన్‌కు దారుణమైన ముగింపు... చెత్త ఆటోలో తీసుకెళ్లి అంత్యక్రియలు
చిత్తూరు జిల్లా మదనపల్లెలో బాలికను రేప్ చేసి హత్య చేసిన నిందితుడు కులవర్థన్‌కు మాత్రం దారుణమైన ముగింపు చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా మదనపల్లె(Madanapalle)లో బాలికను రేప్ చేసి హత్యకు పాల్పడిన ఘటన కలకలం రేగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు కులవర్థన్(Accused Kulvardhan)కు మాత్రం దారుణమైన ముగింపు చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కులవర్థన్ మృతదేహానికి మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు చేశారు. కులవర్థన్ మృతదేహానికి తీసుకెళ్లేందుకు ఆయన తల్లి, బంధువులు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక చెత్తను తరలించే ఆటో(Auto)లో కులవర్థన్ డెడ్ బాడీని శ్మశానికి తరలించారు. దీంతో బాలికలు, మహిళల పట్ల హత్యాచారాలకు పాల్పడే కామాంధుల మృతదేహాలు చెత్తతో సమానమని సమాజానికి ఇది సంకేతమని పలువురు హెచ్చరించారు.
Next Story






