- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijayawada : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు (NTR District Police) తెలిపారు

దిశ, వెబ్ డెస్క్ : ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు (NTR District Police) తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కమిషనరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ధైర్యంగా తమ ఫిర్యాదులను అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
స్వయంగా సమస్యలు విన్న డీసీపీ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఏబిటిఎస్ డీసీపీ ఉదయారాణి (DCP UdayaRani) సారథిగా వ్యవహరించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో స్వయంగా మాట్లాడారు. వారి ఆందోళన తగ్గించేలా మాట్లాడుతూ ధైర్యాన్ని నింపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రజల పక్షాన నిలుస్తారన్నారు. చట్టపరంగా న్యాయమైన విధానంలో సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల విషయమై సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓలతో స్వయంగా మాట్లాడారు. వాటిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మొత్తం 124 ఫిర్యాదులు
ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 124 ఫిర్యాదులను (Complaints) స్వీకరించినట్లు పోలీసులు తెలిపారు. వాటిలో భూ తగాదాలు, ఆస్తి వివాదాలు 70, కుటుంబ కలహాలు 10, ఒక కొట్లాట, 4 మోసాలు, 14 మహిళా అనుబంధ నేరాలు, 3 దొంగతనలు, 22 ఇతర చిన్న సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు.






