Vijayawada : ఎన్టీఆర్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఏక్తా దివస్ వేడుకలు

by Thanuru Gopichand |

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏక్తా దివస్ (Ekta Diwas) వేడుకలు ఘనంగా జరిగాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Vijayawada : ఎన్టీఆర్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఏక్తా దివస్ వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏక్తా దివస్ (Ekta Diwas) వేడుకలు ఘనంగా జరిగాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనరేట్ సిబ్బంది రహదారిపై కవాతు చేస్తూ ఐక్యతా స్ఫూర్తిని చాటి చెప్పారు. వేడుకల్లో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhai Patel) చిత్రపటానికి ఏడీసీపీ కుంభ కోటేశ్వర రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీసీపీ ఎస్.వి.డి ప్రసాద్ జెండా ఊపి రన్ ఫర్ యూనిటీని ప్రారంభించారు. స్వాతంత్య్ర అనంతరం బ్రిటీషు రాజ్యంలో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న వివిధ ప్రాంతాలను సమైక్యతా స్ఫూర్తితో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకం చేశారని గుర్తు చేసుకున్నారు. ఉక్కు మనిషిగా పేరొందిన ఆయన స్ఫూర్తిని ప్రతిఒక్క భారతీయుడు కొనసాగించాలని ఆకాంక్షించారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడాటానికి తమను తాము అంకితం చేసుకుంటామని, తోటి వారితో సమైకత్య స్ఫూర్తి సందేశాన్ని పంచుకుంటామని పోలీసు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. రన్ ఫర్ యూనిటీలో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి, ఏకతా స్ఫూర్తిని ప్రతిబింబించారని తెలిపారు.

Next Story