వైసీపీ వైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ .. రెండు రోజుల్లో క్లారిటీ

by Disha Web Desk 16 |
వైసీపీ వైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ .. రెండు రోజుల్లో క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన పొత్తులు కొత్త తలనెప్పులు తెస్తున్నాయి. పొత్తులో భాగంగా ఎవరికి సీటు వచ్చినా రెండో పార్టీ సహకరించాల్సిందే. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం గెలవాలంటే మైనార్టీలకు సీటు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జలీన్ ఖాన్ అంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తను పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో జలీల్ ఖాన్ వైసీపీ చూస్తున్నారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని ఆయన కలిశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అలెర్ట్ అయ్యారు. జలీల్‌ఖాన్‌ను టీడీపీ నేత కేశినేని చిన్ని కలిశారు. పార్టీ న్యాయం చేస్తుందని జలీల్ ఖాన్‌కు హామీ ఇచ్చారు. దీంతో రెండు రోజుల్లో చంద్రబాబుతో జలీల్ ఖాన్ భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ గెలవాలనే పట్టుదల మాటల్లో కాదని టీడీపీ, జనసేనకు చేతల్లో ఉండాలన్నారు. తాను పార్టీలో ఉంటానా అనేది ముఖ్యంకాదని.. తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారని.. ఈసారి టికెట్ మైనార్టీలకు ఇవ్వకపోతే ఆ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని తెలిపారు. టీడీపీ అధిష్టానంతో చిన్ని మాట్లాడారని.. రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని జలీల్ ఖాన్ పేర్కొన్నారు.

Read More..

Breaking: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం జగన్.. సాక్షం ఇదే..


Next Story

Most Viewed

    null