- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య వృత్తిలో విలువలు లేకుండా పోయాయి: మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
కొన్ని ఆస్పత్రులను చూస్తేనే వామ్మో అనాల్సిస పరిస్థితి వస్తోంది..

దిశ, వెబ్ డెస్క్: కొన్ని ఆస్పత్రులను చూస్తేనే వామ్మో అనాల్సిస పరిస్థితి వస్తోంది. చిన్న రోగం చూపించుకునేందుకు వెళ్తే మొత్తం దోచేస్తున్నారు. డబ్బులే పరమావధిగా వైద్యం చేస్తున్నారు. జ్వరం వస్తే రక్త పరీక్షలు చేస్తున్నారు. మహిళలకు నార్మల్ డెలివరీ అవకాశం ఉన్నా ఫీజులు బాదేందుకు సీజేరియన్లు చేస్తున్నారు. ఇదంతా తెలిసి కూడా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.. దీంతో కొన్ని ఆస్పత్రులు మరింత చెలరేగిపోతున్నాయి. వైద్యం పేరుతో రోగుల నుంచి డబ్బులు భారీగా దండుకుంటున్నారు.
ఈ విషయం మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satykumar Yadav) దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ(Vijayawada)లో పర్యటించిన మంత్రి రాష్ట్రంలో కొన్ని ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. వైద్యమంటే ప్రస్తుతం వ్యాపారంగా మారిందన్నారు. వైద్య వృత్తి(Medical Profession)లో విలువలు లేకుండా పోయాయని చెప్పారు. చిన్న రోగానికే స్కానింగ్‌లు తీస్తున్నారని మండిపడ్డారు. నార్మల్ డెలివరీ చేయడం మానేశారని ఆరోపించారు. అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు.






