- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap News: చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు పురాతన దేవాలయాలను కూల్చి బాత్ రూమ్‌లు కట్టారని ఆమె వ్యాఖ్యానించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ పునరుద్ధరణ చేపట్టారని తెలిపారు. సీఎం జగన్ ఇంకా చాలా దేవాలయాలను పునరుద్ధరిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద భవానీ ఐల్యాండ్‌లో నిర్వహించిన కార్తీక మహోత్సవంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవం చేయించారు. కృష్ణా నదిలో పచ్చటి వాతావరణంలో కార్గీక మహోత్సవం జరిగిందని చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజు శివపార్వతుల కల్యాణాన్ని వీక్షిస్తే సకల పాపాలు తొలగిపోతాయని మంత్రి రోజా తెలిపారు.
Next Story






