వాళ్లకు చుక్కలు చూపిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

కల్తీ మద్యంలో సూత్రధారులు, పాత్రధారులందరికీ చుక్కలు చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు....

వాళ్లకు చుక్కలు చూపిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: కల్తీ మద్యం(Adulterated liquor)లో సూత్రధారులు, పాత్రధారులందరికీ చుక్కలు చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) హెచ్చరించారు. మద్య నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడుగుతామని.. కల్తీ మద్యం అమ్మిన నీచ చరిత్ర వైసీపీ(YCP)దని మండిపడ్డారు. పేర్ని నానికి మతి చెడి ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని విమర్శించారు. రూ.99 బ్రాండ్లు నిలిపివేశామనడం పేర్ని నాని అజ్ఞానానికి నిదర్శనమన్నారు. డిజిటల్ పేమెంట్లు ఎవరి హయాంలో లేకుండా చేశారో ప్రజల్ని అడిగితే చెబుతారన్నారు. ఇండెంట్ ప్రకారమే మద్యం సరఫరా చేస్తారనే కనీస జ్ఞానం లేదా నానీ? అని ప్రశ్నించారు. గత ఐదేళ్లు కల్తీ మద్యాన్ని అమ్మిందెవరో ప్రజలు గుర్తించే మిమ్మల్ని తరిమికొట్టారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.

మొలకలచెరువు, ఇబ్రహీంపట్నం ఘటనల విచారణ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సిట్ విచారణను కూడా తప్పుదోవ పట్టించేలా వైసీపీ సోషల్ మీడియా కుట్ర చేస్తోందని చెప్పారు. వైసీపీ ప్రోత్సాహంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు జనార్ధనరావు అంగీకరించారని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే కల్తీ మద్యం చేసినట్లు జనార్ధన్ ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. హోలోగ్రామ్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం 2014-19లోనే తీసుకొచ్చామన్నారు. తమ కల్తీ మద్యానికి అడ్డొస్తుందనే 2019-24 మధ్య నిలిపివేశారని తెలిపారు. మద్యం కేసు వెనుక వైసీపీ నేతల భారీ కుట్ర బహిర్గతమవడంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసినోళ్లపై, తప్పుడు ప్రచారం చేసినోళ్లపైనా కఠిన చర్యలుంటాయని కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు.

Next Story