మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ జగన్ రెడ్డే: మంత్రి కొల్లు రవీంద్ర

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...

మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ జగన్ రెడ్డే: మంత్రి కొల్లు రవీంద్ర
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అశాంతి రగల్చేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) అన్నారు. మచిలీపట్నం టీడీపీ(Tdp) కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ భ్రష్టుపట్టిపోయిందన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి కులం, మతం ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఐదేళ్ల అరాచకం తర్వాత ప్రజలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారని, పెట్టుబడులు వస్తున్నాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో యువత ఆనందంగా ఉన్నారని, అందుకే రాష్ట్రంలో అలజడులు సృష్టించడం కోసం దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం

‘‘కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జగన్(Jagan) .. సిగ్గు లేకుండా నారా లోకేశ్‌(Nara Lokesh)పై తప్పుడు కూతలు కూస్తున్నారు. మరోవైపు అంబటి రాంబాబు(Ambati Rambabu) ఆంబోతులా రోడ్డుపై పడి విర్రవీగుతున్నారు. వంగవీటి రంగా లాంటి మహనీయులతో పోల్చుకుంటూ రాష్ట్రంలో కులాల మధ్య అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారు. పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కేసిన పేర్ని నాని కూడా నీతులు వల్లిస్తున్నారు. బియ్యం బొక్కేసి డబ్బు కట్టేస్తే నీతి మంతుడిని అయిపోయాను అనేలా వ్యవహరిస్తున్నారు.’’ అని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

జోగి రమేష్ తనకు తాను..

‘‘కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన జోగి రమేష్(Jogi Ramesh) తాను బీసీనని మాట్లాడ్డానికి సిగ్గుపడాలి. ఐదేళ్లు బీసీలపై దాడులు జరిగినపుడు, పీకలు కోసినపుడు ఎక్కడున్నాడని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల వ్యాఖ్యలు, నోటి దురుసు చూసి వీళ్లేం నాయకులని ప్రజలు చీదరించుకుంటున్నారు. గతంలో అధికారంలో ఉండి బూతులు మాట్లాడారు. ఇప్పుడు బూతులు మాట్లాడి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. మేము పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి సరిపోయింది. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. నిబద్దత. అందుకే వైసీపీ నాయకులు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. టీడీపీ నాయకులు ఎంతో సంయమనంతో ఉన్నారు. మా కార్యకర్తలలో ఆవేశం కట్టలు తెంచుకుంటే.. పరిస్థితిని ఊహించడం కూడా కష్టమనే విషయం వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి.’’ అని కొల్లు రవీంద్ర సూచించారు.

Next Story