పేర్ని నాని మతిస్థిమితం కోల్పోయారు: మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

బందరులో ఓటమితో పేర్ని నాని మతిస్థిమితం కోల్పోయారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ..

పేర్ని నాని మతిస్థిమితం కోల్పోయారు: మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: కల్తీ మద్యం(Adulterated liquor) వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని(Former Miniater Perni Nani) చేస్తున్న విమర్శలకు మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బందరులో ఓటమితో పేర్ని నాని మతిస్థిమితం కోల్పోయారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో మద్యాన్ని కల్తీ చేసి జైలుకు వెళ్లారని, ఆ విషయాన్ని పేర్ని నాని మర్చిపోయారా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు క్రమశిక్షణ నేర్పారని, దాని వల్లే సంయమనం పాటిస్తున్నామన్నారు. పేర్నినాని ఇలాగే ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దెబ్బలు తిని సానుభూతి పొందాలని భావిస్తున్నారని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఎవరు చనిపోయినా మద్యం వల్లేనని చెప్పడం సిగ్గుచేటని కొల్లు రవీంద్ర విమర్శించారు. శవ రాజకీయాలు చేయడం జగన్‌కు మామూలేనని ఎద్దేవా చేశారు. లిక్కర్ కేసులో జైలుకెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డి సీబీఐ విచారణ కోరణం విడ్డూరమన్నారు. తప్పుడు, ఫేక్ ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక మద్యం కేసులో ఆరోపణలు వచ్చిన టీడీపీ నేతలపైనా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు పూర్తి పురోగతి కోసం నాలుగు టీములు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. ఇక కేసులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇక నుంచి కల్తీ మద్యం గుర్తించేందుకు ఏపీఏటీఎస్ పేరుతో యాప్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని, సీసాపై ఉన్న లేబుల్ స్కాన్ చేస్తే వివరాలు మొత్తం వస్తాయని తెలిపారు.

Next Story