Breaking: టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్లరాముకు తప్పిన ప్రమాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-11-26 12:11:27  IST  )

కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్లరాముకు ప్రమాదం తప్పింది..

Breaking: టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్లరాముకు తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెనిగండ్లరాము(TeluguDesam Party MLA Venigandla Ramu)కు ప్రమాదం తప్పింది. టీడీపీ ముఖ్య నేతలు, అనుచరులతో కలిసి ప్రైవేటు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన వెళ్లారు. అయితే ఆయనకు ఊహించని ఘటన ఎదురైంది. ఆస్పత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. లోపల అరగంటకు పైగా ఇబ్బందులు పడ్డారు. ఏం జరుగుతుందో అర్థం కాక టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది మరమ్మతులు చేయడంతో అరగంట తర్వాత లిఫ్ట్ ఓపెన్ అయింది.


అయితే లిఫ్ట్ ఓపెన్ టాప్ కావడంతో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన కృష్ణాజిల్లా గుడివాడ (Krishna District Gudivada)నియోజకవర్గంలో జరిగింది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సేఫ్‌గా బయటకు వచ్చారని తెలియడంతో నియోజకవర్గం టీడీపీ నేతలు ఊపరిపీల్చుకున్నారు.

Next Story