కొడాలి నానికి 10 గంటల పాటు ఆపరేషన్ ?

by velandi.Saikiran |   (  Updated:2025-04-02 14:35:33  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ మంత్రి, వైసిపి కీలక నేత కొడాలి నాని ( Kodali Nani ) హెల్త్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.

కొడాలి నానికి 10 గంటల పాటు ఆపరేషన్ ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ మంత్రి, వైసిపి కీలక నేత కొడాలి నాని ( Kodali Nani ) హెల్త్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఆయన ఆరోగ్యం పై తాజాగా కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. కొడాలి నాని కి ( Kodali Nani Health Update) దాదాపు పది గంటల పాటు సర్జరీ ( Surgery) చేసినట్లు చెబుతున్నారు కుటుంబ సభ్యులు. గుండెకు ( Heart) సంబంధించిన ఆపరేషన్ చేసేందుకు గాను హైదరాబాద్ నుంచి కొడాలి నాని ముంబైకి తరలించారు కుటుంబ సభ్యులు.

ఈ సందర్భంగా ప్రముఖ డాక్టర్ పాండ ( Panda) వైద్య బృందం కొడాలి నానికి గుండెకు సంబంధించిన సర్జరీ చేసింది. దాదాపు 10 గంటల పాటు చేసిన ఆపరేషన్... సక్సెస్ అయిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి... ఇప్పుడే చెప్పలేమని.. మూడు గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచామని వివరించారని తెలుస్తోంది. అయితే కొడాలి నాని హెల్త్ అప్డేట్ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా గత వారం రోజుల కిందట... గుండెకు సంబంధించిన వ్యాధి రావడంతో ఏపీ నుంచి... హైదరాబాదులోని ప్రముఖ ఎఐజి ఆసుపత్రికి కొడాలి నానిని తరలించారు కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే.... కొడాలి నాని కి.. రెండు రోజులపాటు ఏఐజి ఆసుపత్రి చికిత్స చేశారు. కానీ గుండెకు సంబంధించిన సర్జరీ చేయాలని వైద్యులు సూచనలు చేయడంతో... ముంబై కి తరలించారు. ఈ తరుణంలోనే తాజాగా 10 గంటల పాటు కొడాలి నాని కి సర్జరీ... చేసినట్లు చెబుతున్నారు.

Next Story