- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొల్లేరులో పెరిగిన వరద ప్రవాహం
మొంథా తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లాలోని (Eluru District) కైకలూరు నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లాలోని (Eluru District) కైకలూరు నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రవాహం పెరగడంలో కొల్లేరు సరస్సు (Kolleru) కట్టలు తెంచుకుంది. నీటి ప్రవాహం అంతకంతకు పెరగడంతో ఎడ్లగాడి, పెనుమాకలంక ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రానికి కొల్లేరు మరింత తీవ్రరూపం దాల్చనుండడంతో ఆటపాక పక్షుల సంరక్షణ (Aatapaka Bird Sanctuary) కేంద్రాన్ని అటవీ శాఖ అధికారులు మూసివేశారు. ఆటపాక నుంచి ఏలూరు గ్రామీణ మండలం, కోమటి లంకలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. లంకవాసులు సురక్షిత ప్రాంతాల్లోనే (Safe Zones) ఉండాలని కోరారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాల సహాయక చర్యలు చేపడుతోందన్నారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
Read More.. Floods Alert: అతి భారీవర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్






