మాకు అప్పగించండి.. మేము నడిపి చూపిస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని సవాల్

by Vemula.Srinu Prasad |

2004లో YSR ముఖ్యమంత్రి అయ్యుండకపోతే అప్పుడే చంద్రబాబు ఆర్టీసీని అమ్మేసేవారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు....

మాకు అప్పగించండి.. మేము నడిపి చూపిస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: 2004లో YSR ముఖ్యమంత్రి అయ్యుండకపోతే అప్పుడే చంద్రబాబు(Chandrababu) ఆర్టీసీ(RTC)ని అమ్మేసేవారని మాజీ మంత్రి పేర్ని నాని(Former Minsiter Perni Nani) అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణ(APSRTC Privatization)పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. ఆర్టీసీని అమ్మకానికి పెట్టారని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చిందంటున్నారని, ఆర్టీసీని నడపడం చేతకాకపోతే వైసీపీకి అప్పగించాలని, తాము నడిపి చూపిస్తామని సవాల్ విసిరారు. ఆర్టీసీ అమ్ముతుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని పేర్ని నాని హెచ్చరించారు.

ఆ బస్సులే తిప్పుతున్నారు..

వైఎస్ జగన్ హయాంలో కొన్న ఎలక్ట్రిక్ బస్సులనే ఇప్పుడూ తిప్పుతున్నారని పేర్ని నాని గుర్తు చేశారు. కొత్త బస్సులు మాత్రం కొనలేమని అంటున్నారని, ప్రభుత్వ రవాణా వ్యవస్థ లేకపోతే ప్రైవేట్ దోపిడీ ఎక్కువ అయిపోతుందని ఆయన తెలిపారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఈ ప్రభుత్వంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్ని నాని పేర్కొన్నారు. ‘‘ఆర్టీసీని అమ్మకానికి పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినందుకే ఆర్టీసీని ప్రైవేటుకు అప్పగిస్తున్నామని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజల ఆస్తులకు ప్రమాదం వస్తుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు వైయస్ జగన్.’’ అని పేర్ని నాని గుర్తు చేశారు.

Next Story