సీసీ కెమెరాలు తప్పనిసరి : ఎన్టీఆర్ జిల్లా పోలీసులు

by Thanuru Gopichand |

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ (NTR District Police) కమిషనరేట్ పరిధిలోని లాడ్డ్ లు, డార్మిటరీల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు.

సీసీ కెమెరాలు తప్పనిసరి : ఎన్టీఆర్ జిల్లా పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లా పోలీస్ (NTR District Police) కమిషనరేట్ పరిధిలోని లాడ్డ్ లు, డార్మిటరీల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ జరిగిన నేపథ్యంలో అప్రమత్తం అయ్యారు. పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు (Commissioner Raja Shekara Babu) ఆదేశాలతో కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగమయ్యారు. వాహనాలు, లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలీసు అధికారులు ప్రతి గదిని తనిఖీ చేసి, బస చేస్తున్న వారి వివరాలను సేకరించి, రిజిస్టర్లు పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లాడ్జ్ నిర్వాహకులకు సూచించారు. లాడ్జ్ పరిసరాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ప్రజలు అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. ఎటువంటి అనుమానం కలిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు (Public) పోలీసు సిబ్బందికి సహకరించాలని విన్నవించారు. పరస్పర సహకారంతో శాంతి, భద్రతల (Law & Order) పరిరక్షణకు పని చేద్దామని అన్నారు.

Next Story