- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > కృష్ణా > ఏపీలో బీజేపీ అభ్యర్థుల పరిశీలన పూర్తి.. పొత్తులపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఏపీలో బీజేపీ అభ్యర్థుల పరిశీలన పూర్తి.. పొత్తులపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేనతో పొత్తులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో నిర్వహించిన ఏపీ బీజేపీ కీలక సమావేశాలు రెండు రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశాల ముగింపు సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పొత్తులు, పార్టీ బలోపేతంపై రాష్ట్రంలోని బీజేపీ నాయకుల అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. అయితే పొత్తుల విషయం బీజేపీ అధిష్టానమే తేల్చుతుందని ఆమె స్పష్టం చేశారు. పొత్తుల విషయమై బీజేపీ కార్యకర్తలతో చర్చించలేదని తెలిపారు. పోటీ చేసే వారి దరఖాస్తులపై మాత్రమే చర్చించామన్నారు. విజయనగరంతో పాటు పెండింగ్ సెగ్మెంట్లపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను పరిశీలించామని పురంధేశ్వరి పేర్కొన్నారు.
Next Story