- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prakasam Barriage: యువకుడి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్
by Vemula.Srinu Prasad |
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద పాత మంగళగిరికి చెందిన ఆటో డ్రైవర్ ఏ కృష్ణ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు...

X
దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద పాత మంగళగిరికి చెందిన ఆటో డ్రైవర్ ఏ కృష్ణ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ వద్ద నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం గమనించిన ఆరో బెటాలియన్‌కి చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్ టీం హుటాహుటిన అక్కడికి వెళ్లి అతనిని రక్షించింది. అనంతరం ప్రాథమిక చికిత్స అందించింది. కృష్ణ పూర్తిగా కోలుకోవడంతో వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న అడిషనల్ డీజీపీ డా ఎస్‌బీ బాగ్చి, నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, కమాండెంట్ సుబ్బారెడ్డిలు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అభినందించారు.
Next Story






